- అరుణాచల్ ప్రదేశ్ మాజీ హోంమంత్రి పక్నా బాగే
ముషీరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్రంలో యువత రాజకీయాల్లోకి రావాలని నేషనల్ పీపుల్స్ పార్టీ నేషనల్ సెక్రెటరీ, అరుణాచల్ ప్రదేశ్ మాజీ హోంమంత్రి పక్నా బాగే పిలుపునిచ్చారు. బుధవారం బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నేషనల్ పీపుల్ పార్టీ ఏపీ, తెలంగాణ కోఆర్డినేటర్ గవ్వల భారత్ కుమార్ ఆధ్వర్యంలో సభ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి పార్టీ నేషనల్ యూత్ ప్రెసిడెండ్ నిక్కీ నాన్గహలాతో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల గొంతుకగా తమ పార్టీ పనిచేస్తుందన్నారు.

