
- సీఎం అడ్డంగా దొరికిండు
- రేవంత్ ఓ గజినీ.. ఆయన చుట్టూ గార్బేజ్ బ్యాచ్
- చిట్ చాట్ లో మాజీ మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్: బనక చర్ల బాగోతాన్ని ప్రసార భారతి బయటపెట్టిందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. బనకచర్ల చీకటి ఒప్పందాన్ని నిన్న ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడిస్తే, ఇవాళ ఆల్ ఇండియా రేడియో బట్టబయలు చేసిందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికి పోయారని చెప్పారు.
ఈ బాగోతాన్ని కవర్ చేసుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడింది తప్పు అని రేవంత్ రెడ్డి ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. డ్రగ్స్, గంజాయి అంటూ మోకాలుకు, బోడి గుండుకు లింకులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు.
జై తెలంగాణ అనవేందుకయ్య అని మేము అడిగితే... తమ పార్టీ పైన ఏదో అంటున్నారన్నారు. రాహుల్ గాంధీ, మీ ఖర్గే కూడా జై తెలంగాణ అన్నారని గుర్తు చేశారు