ఐసీసీ టెస్ట్‌‌‌‌‌‌‌‌ ర్యాంకింగ్స్‌‌‌‌‌‌‌‌లో టాప్‌‌‌‌‌‌‌‌–10లో విరాట్‌‌‌‌‌‌‌‌ కోహ్లీ

ఐసీసీ టెస్ట్‌‌‌‌‌‌‌‌ ర్యాంకింగ్స్‌‌‌‌‌‌‌‌లో టాప్‌‌‌‌‌‌‌‌–10లో విరాట్‌‌‌‌‌‌‌‌ కోహ్లీ

దుబాయ్‌ ‌‌‌‌‌‌‌:  టీమిండియా మాజీ కెప్టెన్‌‌‌‌‌‌‌‌ విరాట్‌‌‌‌‌‌‌‌ కోహ్లీ.. ఐసీసీ టెస్ట్‌‌‌‌‌‌‌‌ ర్యాంకింగ్స్‌‌‌‌‌‌‌‌లో టాప్‌‌‌‌‌‌‌‌–10లోకి వచ్చాడు. బుధవారం విడుదల చేసిన తాజా జాబితాలో 761 రేటింగ్‌‌‌‌‌‌‌‌ పాయింట్లతో 9వ ర్యాంక్‌‌‌‌‌‌‌‌కు చేరాడు. సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్‌‌‌‌‌‌‌‌లో 38, 76 రన్స్‌‌‌‌‌‌‌‌ చేయడం విరాట్‌‌‌‌‌‌‌‌ ర్యాంక్‌‌‌‌‌‌‌‌ మెరుగుపడటానికి దోహదం చేసింది. 2022లో కోహ్లీ టాప్‌‌‌‌‌‌‌‌–10 నుంచి బయటకు వెళ్లిపోయాడు. కెప్టెన్‌‌‌‌‌‌‌‌ రోహిత్‌‌‌‌‌‌‌‌ శర్మ (719)..14వ  ర్యాంక్‌‌‌‌‌‌‌‌కు పడిపోయాడు. 

కేఎల్‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌ (508).. 11 ప్లేస్‌‌‌‌‌‌‌‌లు మెరుగుపడి 51వ ర్యాంక్‌‌‌‌‌‌‌‌కు చేరాడు. బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ రవిచంద్రన్‌‌‌‌‌‌‌‌ అశ్విన్‌‌‌‌‌‌‌‌ (872) టాప్‌‌‌‌‌‌‌‌ ర్యాంక్‌‌‌‌‌‌‌‌లో కొనసాగుతున్నాడు. జడేజా (774), బుమ్రా (767) వరుసగా నాలుగు, ఐదు ర్యాంక్‌‌‌‌‌‌‌‌ల్లో ఉన్నారు. ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్స్‌‌‌‌‌‌‌‌ లిస్ట్‌‌‌‌‌‌‌‌లో జడేజా (446), అశ్విన్‌‌‌‌‌‌‌‌ (348), అక్షర్‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌ (291) వరుసగా ఒకటి, రెండు, ఐదు ర్యాంక్‌‌‌‌‌‌‌‌ల్లో నిలిచారు.