
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ రాజకీయ అరంగ్రేటం చేయనున్నట్లు కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. భారత రెజ్లర్ శుక్రవారం (ఆగస్టు 23) కాంగ్రెస్ నాయకుడు, హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడాను కలవగానే ఈ వార్తలు గుప్పుమన్నాయి. త్వరలోనే ఆమె హస్తం గూటికి చేరనున్నారని, రాబోయే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయవచ్చని కథనాలు వచ్చాయి. తాజాగా, ఈ ఊహాజనిత కథనాలపై మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా వివరణ ఇచ్చారు.
వినేశ్ ఫోగాట్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారనే వార్తలను హర్యానా మాజీ ముఖ్యమంత్రి కొట్టి పారేశారు. ఇదొక ఊహాజనిత ప్రచారమని తెలిపారు. రాజకీయాల్లోకి రావాలా..! వద్దా..! వస్తే ఏ పార్టీలో చేరాలనేది ఆమె నిర్ణయమని వెల్లడించారు.
Also Read :- రిటైర్మెంట్ ప్రకటించిన శిఖర్ ధావన్
"ఇదొక ఊహాజనిత ప్రచారం. అథ్లెట్లు ఒక్క పార్టీకి చెందినవారు కాదు. యావత్ దేశానికి చెందినవారు.పార్టీలో చేరితే ప్రజలకు తెలుస్తుంది. రాజకీయాల్లోకి రావాలా..! వద్దా..! ఒకేవేళ రావాలనుకుంటే ఏ పార్టీలో చేరాలనేది ఆమె నిర్ణయం. ఆమెపైనే ఆధారపడి ఉంది. ఇప్పుడు మేం కోరేది ఒక్కటే ఆమెను రాజ్యసభకు నామినేట్ చేయాలి.." అని భారత రెజ్లర్ కాంగ్రెస్‌లో చేరతారా? అన్న ప్రశ్నకు హుడా బదులిచ్చారు.
दिल्ली आवास पर देश की शान और प्रदेश का गौरव बढ़ाने वाली पहलवान खिलाड़ी विनेश फोगाट से सपरिवार शिष्टाचार भेंट हुई। @Phogat_Vinesh pic.twitter.com/rZTR5nBush
— Bhupinder S Hooda (@BhupinderShooda) August 23, 2024
చేజారిన పతకం
రెజ్లింగ్ విభాగంలో భారత్ కు పతకం ఖాయం అనుకున్న దశలో వినేశ్ ఫొగాట్ పై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. ఆమె 50 కిలోల ప్రీ స్టైల్ విభాగంలో పోటీ పడగా.. ఉండాల్సిన బరువు కంటే 100 గ్రాముల అధిక బరువు ఉండటంతో అనర్హత వేటు వేశారు. దాంతో, ఆమె ఫైనల్ పోరుకు దూరమయ్యింది. అనంతరం ఆమె తనపై పడ్డ అనర్హత వేటును సవాల్ చేస్తూ అంతర్జాతీయ క్రీడా న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పటికీ నిరాశే ఎదురైంది.
కాగా, అక్టోబర్ 1న హర్యానా విధానసభకు ఎన్నికలు జరగనున్నాయి.