ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదు వ్యవస్థ

ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదు వ్యవస్థ

ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదు వ్యవస్థ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిలో జరుగుతున్న టీడీపీ ‘మహానాడు’ రెండోరోజు ప్రారంభమైంది. గురువారం మాజీ ముఖ్యమంత్రి, నటుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. ఆ తర్వాత ప్రారంభమైన మహానాడులో ఆయన ప్రసంగించారు. ఎన్టీఆర్ జీవితం ఎందరికో ఆదర్శనీయమని ఆయన అన్నారు. సేవకు నిలువెత్తు రూపం ఎన్టీఆర్ అని చంద్రబాబు అన్నారు.

‘మనపై బురదజల్లిన వారే బురదలో కూరుకుపోయారు. రాజకీయాల్లో ఎన్టీఆర్ కు ఎవరూ సాటిలేరు. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. పేదల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ఆయన ప్రవేశపెట్టారు. మహిళలకు రాజకీయ అవకాశాలు కల్పించారు. ఎన్టీఆర్
అందరికీ సామాజిక న్యాయం చేశారు. ఎన్టీఆర్ తెలుగుదనానికి నిలువెత్తు రూపం. భారతప్రభుత్వం ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలి. పేదలకు పట్టెడన్నం పెట్టడమే తన సిద్ధాంతమని ఎన్టీఆర్ చెప్పేవారు. తెలుగుదేశం పార్టీ ఎవరికీ భయపడదు. సవాళ్లు తెలుగుదేశానికి కొత్తేమీ కాదు. తెలుగుదేశాన్ని ఎవరూ కదిలించలేరు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కార్యకర్తలు పార్టీకి అండగా నిలబడుతున్నారు. కార్యకర్తలే తెలుగుదేశానికి శక్తి. వైసీపీ బెదిరింపులకు ఎవరూ భయపడరు. హత్యా రాజకీయాలు మాకు అలవాటు లేదు. డాక్టర్ సుధాకర్ విషయంలో వైసీపీ తీరు దుర్మార్గం. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం అధికారంలోకి రావడం ఖాయం’ అని చంద్రబాబు అన్నారు.

For More News..

కరోనాతో సౌదీలో తెలంగాణ యువకుడు మృతి

పనివాళ్లను ఫ్లైట్లో సొంతూరికి పంపించిన యజమాని

అమెరికాలో లక్ష దాటిన కరోనా మృతులు