రీల్ సీఎంగా యడ్యూరప్ప

రీల్ సీఎంగా యడ్యూరప్ప
  • ‘తనూజ’ సినిమాలో నటిస్తున్న మాజీ సీఎం యడ్యూరప్ప

బెంగళూర్: కర్ణాటక రాష్ట్రానికి నాలుగు సార్లుగా సీఎంగా పని చేసిన బీఎస్ యడ్యూరప్ప... ఇప్పుడు ఓ కన్నడ సినిమాలో సీఎంగా నటిస్తున్నారు. ‘తనూజ’ అనే సినిమాతో ఈ మాజీ సీఎం సాండల్వుడ్లో అరంగేట్రం చేస్తున్నారు. బియాండ్ విజన్ సినిమాస్ బ్యానర్లో రూపొందుతున్న ఈ సినిమాకు హరీష్ ఎండీ హల్లీ డైరెక్షన్ చేస్తున్నాడు. కాగా తనూజ సినిమా ఓ రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కుతోందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు.

రెండేళ్ల కిందట యడ్యూరప్ప కర్ణాటక సీఎంగా ఉన్నారు. ఆ సమయంలో కరోనా విజృంభించడంతో కర్ణాటకలో లాక్డౌన్ విధించారు యడ్డీ. అయితే లాక్డౌన్  వల్ల చాలా మంది సఫర్ అయ్యారు. ఈ క్రమంలోనే తనూజ అనే అమ్మాయి నీట్ ఎగ్జామ్ రాయడానికి ఎన్ని ఇబ్బందులు పడింది? ఆమెకు ఎవరు హెల్ప్ చేశారు? సీఎం యడ్యూరప్పకు ఈ కథకు లింకేంటి? అనేది తెరపైనే చూడాలని అంటున్నారు డైరెక్టర్ హరీష్. అప్పుడు రియల్ సీఎంగా చేసిన పనిని...ఇప్పడు రీల్ సీఎంగా చేయబోతున్నారు యడ్యూరప్ప. ఇప్పటికే ఫస్ట్ పార్ట్ షూటింగ్ కూడా పూర్తి చేశారు. రియల్ సీఎంగా సక్సెస్ అయిన యడ్యూరప్ప.. రీల్ సీఎంగా కూడా అలరించాలని కోరుకుంటున్నారు ఆయన ఫ్యాన్స్.

మరిన్ని వార్తల కోసం..

ఎమ్మెల్యే రాజాసింగ్పై ఎఫ్ఐఆర్

'కళావతి’ పాటకు సితార స్టెప్పులు