సెప్టెంబర్ 17 సమైక్యత దినోత్సవం కాదు.. విలీన దినోత్సవం : సురవరం

సెప్టెంబర్ 17 సమైక్యత దినోత్సవం కాదు.. విలీన దినోత్సవం  : సురవరం
  • సెప్టెంబర్ 17 సమైక్యత దినోత్సవం కాదు.. విలీన దినోత్సవం
  • సాయుధ పోరాటాన్ని కేసీఆర్ సర్కార్ నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నది : సురవరం

హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం ‘సెప్టెంబర్ 17’ను జాతీయ సమైక్యత  దినోత్సవంగా నిర్ణయించడం.. తెలంగాణ సాయుధ పోరాటాన్ని నీరుగార్చే ప్రయత్నమని సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి విమర్శించారు. ఇది సమైక్య దినోత్సవం కాదని, విలీన దినోత్సవమని స్పష్టం చేశారు. తెలంగాణ సాయుధ పోరాటం 75వ వార్షికోత్సవాల్లో భాగంగా తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్ రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో సోమవారం సదస్సు నిర్వహించారు. 

ఈ సందర్భంగా సురవరం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ముస్లిం రాజుకు, హిందూ ప్రజలకు జరిగిన పోరాటంగా బీజేపీ చరిత్రను వక్రీకరించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. స్వాతంత్య్ర ఉద్యమకారులకు కూడా పింఛన్  ఇవ్వడం లేదన్నారు. తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తిని ప్రజలకు పంచాలని సుధాకర్ రెడ్డి సూచించారు. ప్రొఫెసర్ ఎస్వీ  సత్యనారాయణ మాట్లాడుతూ..  అనేక మంది కవులు తమ కావ్యాలు, పాటలు, రచనల ద్వారా సాయుధ రైతాంగ ఉద్యమాన్ని ఎంతో ప్రభావితం చేశారని గుర్తుచేశారు. మాతృభాష తెలుగు నిరాదరణకు గురైందని, ఉర్దూనే చదువుకోవాల్సిన పరిస్థితులు ఉండేవన్నారు. ప్రొఫెసర్ చింతకింది కాశీం మాట్లాడుతూ.. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకుంటున్న వారు ఆనాటి పోరాటంలో తమ వారు ఎవరెవరు చనిపోయారో జాబితా చెబుతారా? అని బీజేపీని ఉద్దేశించి ప్రశ్నించారు. 

భాష కోసం ప్రారంభమైన ఉద్యమం తెలంగాణ సాయుధ పోరాటానికి పునాది వేసిందన్నారు. పాశం యాదగిరి, స్మారక ట్రస్ట్ కార్యదర్శి కందిమళ్ల ప్రతాపరెడ్డి, ఈసీ మెంబర్ ఉజ్జిని రత్నాకర్ రావు, అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణ, రావినారాయణ రెడ్డి కుమార్తె రావి భారతి హాజరయ్యారు. సదస్సులో 102 ఏండ్ల ఫ్రీడమ్​ఫైటర్​ ఏటుకూరి కృష్ణమూర్తితో పాటు పలువురిని సన్మానించారు.

ట్యాంక్ బండ్​పై ఎర్ర కవాతు

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా సోమవారం హైదరాబాద్​లో ట్యాంక్ బండ్​పై అంబేద్కర్ విగ్రహం నుంచి మగ్దూం మొహి యుద్దీన్ విగ్రహం వరకు సీపీఐ ఆధ్వర్యంలో భారీ కవాతు నిర్వ హించారు. మొహియుద్దీన్ విగ్రహా నికి సీపీఐ జాతీయ కార్యదర్శులు నారాయణ, అజీజ్ పాషా, సిటీ సెక్రటరీ ఛాయాదేవి, రాష్ట్ర నాయ కులు వీఎస్ బోస్, నర్సింహా తదిత రులు నివాళి అర్పించారు. నారా యణ మాట్లాడుతూ.. నిజాం పెట్టిన ఎంఐఎం పార్టీకి సీఎం కేసీఆర్ లొంగిపోయారని విమర్శించారు. తెలంగాణలో విలీన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్​ చేశారు.