టెస్టు క్రికెట్ పై మాజీ క్రికెటర్ రవిశాస్త్రి ఆందోళన

టెస్టు క్రికెట్ పై మాజీ క్రికెటర్ రవిశాస్త్రి ఆందోళన

టెస్టు క్రికెట్ పై మాజీ క్రికెటర్ రవిశాస్త్రి ఆందోళన వ్యక్తం చేశారు. వరల్డ్ వైడ్ గా టీ20 లీగ్స్ పెరుగుతున్నందున టెస్ట్ క్రికెట్ కు ఆదరణ తగ్గిపోతుందని చెప్పారు. ఆటగాళ్ల ప్రతిభకు టెస్ట్ క్రికెటే కొలమానమని చెప్పారు. టెస్టు క్రికెట్ లో ఆరు జట్లు ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. క్రికెట్ కూడా ఫుల్ బాల్ మోడల్ వైపు దూసుకుపోతుందని రవిశాస్త్త్రి ఆవేదన వ్యక్తం చేశాడు. 

టెస్టు క్రికెట్ కు ఆదరణ పెరగాలంటే టెస్ట్ జట్లను తగ్గించాల్సిన అవసరం ఉందని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. క్రికెట్ నాణ్యత, పరిణామం పెరిగేందుకు ఇది ఉపయోగపడుతుందని చెప్పాడు. టెస్ట్ క్రికెట్ నాణ్యత కోల్పోతే మాత్రం క్రికెట్ పై ఫ్యాన్స్ కు ఆసక్తి తగ్గుతుందన్నాడు. దీని ద్వారా ప్రసార హక్కులు యాజమాన్యాలపై యజమాన్యాలు విముఖత చూపించే పరిస్థితి వస్తుందన్నాడు. 

ఫుల్ బాల్ లీగ్స్ మాదిరిగానే క్రికెట్ లీగ్స్ పుట్టుకురావడంపై రవిశాస్త్రి ఆందోళన చెందారు. ఇది ఇలాగే కొనసాగితే వరల్డ్ కప్ నిర్వహించేందుకు దారితీసే అవకాశాలు లేకపోలేదని చెప్పాడు. తన దృష్టిలో టెస్టు హోదాతో శాశ్వత జట్లు ఉండవని..ఆరు జట్లు మాత్రమే ఉంటాయన్నాడు.