వెలుగు, భద్రాచలం: వారంతా బస్తర్ దండకారణ్యంలో తుపాకులు చేతబట్టి ఉద్యమం చేసిన మహిళా మావోయిస్టులు. ఇటీవలే ఆపరేషన్ కగార్‌లో భాగంగా జనజీవన స్రవంతిలో కలిశారు. చత్తీస్‌గఢ్ రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్ వేదికగా బుధవారం రాత్రి నిర్వహించిన జాతీయ చేనేత ఫ్యాషన్ షోలో వారు చేనేత దుస్తులు ధరించి ర్యాంప్ వాక్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. వేడుకలకు ఆ రాష్ట్ర సీఎం విష్ణుదేవ్ సాయి, మాజీ సీఎం రమణ్‌సింగ్ హాజరై వారిని ఉత్సాహపరిచారు.
గతంలో తుపాకులతో సహవాసం చేసిన వారు చేనేత వస్త్రాలు ధరించి ఆత్మవిశ్వాసంతో వాక్ చేయడం ఆకట్టుకుంది. మాజీ మావోయిస్టుల ర్యాంప్ వాక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్అయ్యాయి.
