గౌతమ్ గంభీర్..టీమిండియా రియల్ ఛాంపియన్

గౌతమ్ గంభీర్..టీమిండియా రియల్ ఛాంపియన్

టీమిండియా మాజీ  ఓపెనర్ గౌతమ్ గంభీర్ ..భారత క్రికెట్కు దొరికిన ఆణిముత్యం. 2007లో టీ20 వరల్డ్ కప్ గెలుచుకోవడంలో...2011 వన్డే వరల్డ్ కప్ విజయంలో..గంభీర్ పాత్ర కీలకం. రెండు మెగా టోర్నీల్లో ..గంభీర్ వల్లే టీమిండియా విజేతగా నిలిచిందంటే అతిశయోక్తి కాదు. మైదానంలో..ఆటతోనూ..మైదానం బయట మాటతోనూ అభిమానుల  మనసుల్లో చోటు దక్కించుకున్న గంభీర్.. 41వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా గంభీర్కు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.


బీసీసీఐ విషెష్..
242 ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌లు, 10324 ఇంటర్నేషనల్‌ రన్స్‌.. 2007 వరల్డ్‌ టీ20, 2011 వరల్డ్‌ కప్‌ విన్నర్‌ గౌతమ్‌ గంభీర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ అటు బీసీసీఐ ట్వీట్‌ చేసింది. 

విజయం సిద్ధించాలి..
టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా ట్విటర్‌ ద్వారా గంభీర్ కు బర్త్‌డే విషెస్‌ చెప్పాడు. పుట్టిన రోజు సందర్భంగా గౌతమ్‌ గంభీర్‌కు మంచే జరగాలని కోరుకున్నాడు. అతనికి విజయం సిద్ధించాలని దేవున్ని  ప్రార్థించాడు. నిజమైన స్నేహితుడు, గొప్ప మనిషి... హ్యాపీ బర్త్‌డే బ్రదర్" అని రైనా ట్వీట్ చేశాడు.

నువ్వో ఛాంపియన్..
గంభీర్కు యువరాజ్ సింగ్ బర్త్ డే శుభాకాంక్షలు తెలిపాడు.  ప్రియమైన సోదరుడు గౌతమ్‌ గంభీర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పాడు. ప్రతీ అంశంలో గంభీర్ ఛాంపియన్ అని కొనియాడాడు. త్వరలోనే నిన్ను  కలవాలని అనుకుంటున్నాను" అని యువీ ట్వీట్ చేశాడు. 

దేశానికి ఎంతో చేశావ్..
గంభీర్కు భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. ఆటగాడిగా దేశానికి ఎంతో సేవ చేశావని మెచ్చుకుంది. ఎల్లప్పుడు సంతోషంగా ఉండాలని..విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు ట్వీట్లో పేర్కొంది.

 

గంభీర్దే కీలకపాత్ర..
2007 టీ20 వరల్డ్ కప్, 2011 వరల్డ్ కప్లలో టీమిండియా విజయంలో గంభీర్ ది కీలక పాత్ర. రెండు ప్రపంచకప్ ఫైనల్స్ లో భారత్ తరపున గంభీర్ అత్యధిక స్కోరు చేశాడు. 2007 వరల్డ్ కప్ ఫైనల్లో 75 పరుగులు చేస్తే..2011 ఫైనల్లో 97 రన్స్ కొట్టాడు. రెండు వరల్డ్‌కప్‌ ఫైనల్స్‌ విజయాల్లో గంభీరే అత్యధిక స్కోరు సాధించినా ..కూడా అతనికి ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్ అవార్డుు మాత్రం దక్కలేదు. అద్భుతంగా ఆడినా కూడా రావాల్సినంత పేరు మాత్రం రాలేదు. 

గౌతీ కెరీర్..
తన కెరీర్ లో 58 టెస్టులు ఆడిన గంభీర్..4154 పరుగులు చేశాడు. ఇందులో 9 సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలున్నాయి. 147 వన్డేల్లో 5238 పరుగులు సాధించాడు. ఇందులో 11 సెంచరీలు, 34 అర్థసెంచరీలు ఉన్నాయి. ఇక 37 టీ20ల్లో 932 పరుగులు చేయగా..ఇందులో 7 హాఫ్ సెంచరీలు ఉండటం విశేషం.