పెద్దపల్లి జిల్లా మంథని మాజీ ఎమ్మెల్యే చందుపట్ల రాంరెడ్డి కన్నుమూశారు. అనారోగ్యంతో కొంతకాలంగా హైదరాబాదులోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ (ఫిబ్రవరి3) ఉదయం తుదిశ్వాస విడిచారు.రాంరెడ్డి మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు.
రాంరెడ్డి ముత్తారం మండలం ఖమ్మంపల్లి స్వగ్రామం. గ్రామ సర్పంచ్ గా, రాజకీయ రంగప్రవేశం చేసిన అతను ముత్తారం మండల పరిషత్ అధ్యక్షుడుగా, మంథని ఎమ్మెల్యే పనిచేశారు. అభిమానులు రామన్న అని పిలుస్తారు.1994 లో మంథని నియోజకవర్గం నుంచి మాజీ శాసనసభ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాద రావుపై గెలుపొందారు. 1999వరకు మంథని ఎమ్మెల్యే గా పని చేశారు. 1999లో దుద్దిళ్ల శ్రీధర్ బాబు చేతిలో ఓటమి పాలయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్ఎస్ లో చేరారు. 2021లో టీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు.
