నా కొడుకు  ఇంటికి వస్తే.. వన దేవతలకు మొక్కులు చెల్లించుకుంటా :  మాజీ మావోయిస్టు నేత  దామోదర్  తల్లి బతుకమ్మ

 నా కొడుకు  ఇంటికి వస్తే.. వన దేవతలకు మొక్కులు చెల్లించుకుంటా :  మాజీ మావోయిస్టు నేత  దామోదర్  తల్లి బతుకమ్మ
  • మాజీ మావోయిస్టు నేత దామోదర్  తల్లి బతుకమ్మ

తాడ్వాయి, వెలుగు: ‘నా కొడుకు  ఇంటికి వస్తే వన దేవతలకు మొక్కులు చెల్లించుకుంటా’ అని  మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్  దామోదర్  తల్లి బతుకమ్మ తెలిపారు. బడే చొక్కారావు అలియాస్  దామోదర్  మంగళవారం డీజీపీ ఎదుట లొంగిపోగా, దామోదర్  స్వగ్రామం ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామంలోని ఆయన తల్లి బతుకమ్మను వీ6 వెలుగు ప్రతినిధి పలకరించగా స్పందించారు.

‘ఊళ్లో వాళ్లు చెబుతుంటే విన్నాను.. నా కొడుకు అడవి ఇడిసి ఇంటికి రావాలని మేడారం సమ్మక్క సారలమ్మకు మొక్కుకున్నా’, ‘నా కొడుకు ఇంటికి వచ్చిన వెంటనే కుటుంబ సమేతంగా దేవతలకు మొక్కులు  చెల్లించుకుంటా’ అని చెప్పారు. తాను బతికుండగానే సరెండర్  అయ్యి ఇంటికి రావాలని దేవతలను కోరుకున్నానని తెలిపారు. దేవతల దయతో ఇదంతా జరిగిందని, కొడుకు పోలీసుల ఎదుట సరెండర్  కావడం సంతోషంగా ఉందని చెప్పారు. ప్రస్తుతం దామోదర్ తల్లి అనారోగ్యంతో బాధపడుతోంది.