మాజీమంత్రి అచ్చెన్నాయుడుకు బెయిల్ మంజూరు

మాజీమంత్రి అచ్చెన్నాయుడుకు బెయిల్ మంజూరు

అమరావతి: మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు హైకోర్టులో ఊరట లభించింది. బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఆదేశాలిచ్చింది. కార్మిక శాఖా మంత్రిగా ఉన్న హయాంలో ఈఎస్ఐ స్కామ్ లో  మాజీ మంత్రి అచ్చెన్నాయుడును అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 76 రోజులుగా ఆయన రిమాండ్ లో ఉంటున్నారు. పలుమార్లు బెయిల్ కు కోర్టు నిరాకరించింది. కొద్ది రోజుల క్రితం కరోనా పాటిజివ్ రావడంతో హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్ఆర్ఐ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపధ్యంలో మరోసారి కోర్టు తలుపులు తట్టారు అచ్చెన్నాయుడు తరపు న్యాయవాదులు. ఎట్టకేలకు బెయిల్ దొరికింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అచ్చెన్నాయుడు ను పలువురు ముఖ్య నేతలు పరామర్శించేందుకు వస్తున్నారు.

పరామర్శకు ఎవరూ రావొద్దు: ఎంపీ రామ్మోహన్ నాయుడు

బాబాయ్ కి బెయిల్ వచ్చినా, ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయినందున వైద్యులు చికిత్స అందిస్తున్నారని, దయచేసి ఎవరూ పరామర్శించేందుకు రావొద్దని ఎంపీ రామ్మోహన్ నాయుడు అందరికీ విజ్ఞప్తి చేశారు.

“మీ అభిమానమే మాకు కొండంత అండ. బాబాయ్ కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ కింజరాపు కుటుంబం తరఫున పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కష్టకాలంలో మా కుటుంబానికి అండగా నిలిచిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు, టీడీపీ నేతలకు, కార్యకర్తలకు శిరసు వంచి నమస్కరిస్తున్నాను” అంటూ రామ్మోహన్ నాయుడు ట్వీట్ చేశారు.