మాజీమంత్రి జీవన్‌‌‌‌‌‌‌‌రెడ్డికి అస్వస్థత ...హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ కిమ్స్‌‌‌‌‌‌‌‌ లో ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌

మాజీమంత్రి జీవన్‌‌‌‌‌‌‌‌రెడ్డికి అస్వస్థత ...హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ కిమ్స్‌‌‌‌‌‌‌‌ లో ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌

జగిత్యాల, వెలుగు : మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత తాటిపర్తి జీవన్‌‌‌‌‌‌‌‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. గురువారం నియోజకవర్గంలో జరిగిన పలు కార్యక్రమాలకు హాజరైన జీవన్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఇంటికి చేరుకున్నాక ఒక్కసారిగా అనారోగ్యం బారిన పడ్డారు. గమనించిన కుటుంబ సభ్యులు స్థానిక ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన డాక్టర్లు రక్తం తక్కువగా ఉండటంతో పాటు ఒత్తిడి పెరిగిందని చెప్పడంతో వెంటనే హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని కిమ్స్‌‌‌‌‌‌‌‌కు తరలించగా.. ప్రస్తుతం ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ అందిస్తున్నారు. జీవన్‌‌‌‌‌‌‌‌రెడ్డి అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు చేరుకొని జీవన్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. జీవన్‌‌‌‌‌‌‌‌రెడ్డి త్వరగా కోలుకోవాలని టీపీసీసీ చీఫ్‌‌‌‌‌‌‌‌ మహేశ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌ ఆకాంక్షించారు.