సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో మునుగోడు ఉప ఎన్నిక

సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో మునుగోడు ఉప ఎన్నిక

మునుగోడు ఉప ఎన్నిక సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో వచ్చే అవకాశం ఉందని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. పాదయాత్రలో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను లంచ్ టైంలో మర్యాదపూర్వకంగా కలిశానని తెలిపారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో పాదయాత్ర రూట్ మ్యాప్ లో మార్పులు చేయాలని బండి సంజయ్ అడిగానని చెప్పారు. ఈనెల 21వ తేదీన చౌటుప్పల్ లో అమిత్ షా బహిరంగ సభ ఉంటుందని, దీనికి భారీగా జన సమీకరణ చేయాలని నిర్ణయించామని తెలిపారు.

గుత్తా సుఖేందర్ రెడ్డిపై ఆగ్రహం

శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని తనపై మాట్లాడితే బాగుంటుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తమపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. తాను పదవులు, డబ్బు కోసం పార్టీ మారలేదని మరోసారి స్పష్టం చేశారు. పార్టీలు, కండువాలు మార్చిన చరిత్ర గుత్తా సుఖేందర్ రెడ్డిదే అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.