వికారాబాద్ జిల్లా తాండూరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పోలీసుల విధులకు ఆటంకం కల్గించారని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డితో పాటు మరో 8 మందిపై పోలీసులు కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేసు నమోదైన పైలెట్ రోహిత్ రెడ్డి తన అనుచరులు, బీఆర్ఎస్ కార్యకర్తలతో తన ఇంటి నుంచి భారీ ర్యాలీగా పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. ముందస్తుగా పోలీస్ స్టేషన్ దగ్గర పోలీసులు భారీగా మొహరించారు. పీఎస్ ముందు భారీకేడ్లు ఏర్పాటు చేశారు. కాసేపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు.
వికారాబాద్ జిల్లాలో వికారాబాద్, పరిగి, కొడంగల్, తాండూరులో కాంగ్రెస్ అభ్యర్థులే చైర్పర్సన్లు అయ్యారు. తాండూరు మున్సిపాలిటీలో 36 వార్డులకు కాంగ్రెస్ 19 వార్డులు గెలిచింది. ఒక ఇండిపెండెంట్, ఎక్స్ అఫిషియో ఓటుతో మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. తాండూర్ లో 12వ వార్డు నుంచి గెలిచిన పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి చైర్‌పర్సన్‌గా, 29వ వార్డు నుంచి గెలిచిన అబ్దుల్ రజాక్ వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు.
