గాంధీభవన్‌లో పొన్నం ప్రభాకర్ అనుచరుల ఆందోళన

గాంధీభవన్‌లో పొన్నం ప్రభాకర్ అనుచరుల ఆందోళన

హైదరాబాద్ గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ సీనియర్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అనుచరులు ఆందోళనకు దిగారు. పీసీసీ ఎన్నికల కమిటీలో పొన్నం ప్రభాకర్‌కు చోటు దక్కలేదంటూ నిరసన వ్యక్తం చేశారు. పొన్నంకు అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తించారు. ఏ కమిటీలోనూ పొన్నం ప్రభాకర్ కు స్థానం కల్పించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ఏఐసీసీ నియమించిన ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ (పీఈసీ)లో చోటు లభించకపోవడంతో  పొన్నం ప్రభాకర్‌ కొంత అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు.. బీసీ నేత ఈరవర్తి అనిల్ ను కూడా పక్కన పెట్టారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

తమ నాయకుడు పొన్నం ప్రభాకర్ కు ఎన్నికల కమిటీల్లోనూ చోటు కల్పించాలంటూ శనివారం (జులై 22న) సాయంత్రం వరకు పొన్నం ప్రభాకర్ అనుచరులు డెడ్ లైన్ విధించారు. అయితే... రాష్ర్ట నాయకత్వం నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో ఆదివారం (జులై 23న) హైదరాబాద్ గాంధీభవన్ కు పెద్ద సంఖ్యలో కరీంనగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు తరలివచ్చారు. పొన్నం ప్రభాకర్‌కు మద్దతుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలు ఆదివారం (జులై 23న) ఛలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టారు. అన్ని నియోజకవర్గాల నుంచి నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్‌కు తరలివచ్చారు. ఏదో ఒక నిర్ణయం చెప్పాలంటూ నేతలు డిమాండ్ చేస్తున్నారు. బీసీ నేతలకు కాంగ్రెస్ పార్టీలో అన్యాయం చేస్తున్నారంటూ  కొందరు పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు.. హైదరాబాద్ గాంధీభవన్‌లో పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమైంది. రాష్ట్ర పార్టీ ఇన్ చార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే అధ్యక్షతన ఈ సమావేశంలోలో వివిధ అంశాలపై చర్చించనున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క్‌, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు. వచ్చే వంద రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాలు, పార్టీలో చేరికలు, నేతల మధ్య సమన్వయంపై చర్చిస్తున్నారు.

https://www.youtube.com/watch?v=ahoybU23Ow0