కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపిస్తేనే అభివృద్ధి  : వరంగల్ మాజీ మేయర్ గుండు సుధారాణి

కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపిస్తేనే అభివృద్ధి  : వరంగల్ మాజీ మేయర్ గుండు సుధారాణి

కోరుట్ల, వెలుగు: కాంగ్రెస్​ అభ్యర్థులను గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని అని వరంగల్ మాజీ మేయర్ గుండు సుధారాణి,  కాంగ్రెస్​ కోరుట్ల నియోజకవర్గ ఇన్‌‌ చార్జి జువ్వాడి నర్సింగరావు అన్నారు. ఆదివారం మెట్‌‌ పల్లిలో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా వారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజలకు అండగా నిలిచేది  కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.

కాంగ్రెస్  ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. వార్డులు అభివృద్ధి చెందాలంటే అధికార పార్టీ అభ్యర్థులకు గెలిపిస్తేనే అభివృద్ధి చెందుతాయన్నారు.