పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీకి కరోనా

పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీకి కరోనా

న్యూఢిల్లీ: పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీకి కరోనా సోకింది. ఈ మేరకు తనకు కరోనా పాజిటివ్‌ అని శనివారం మధ్యాహ్నం సోషల్ మీడియా ద్వారా అఫ్రిది తెలిపాడు. ‘గురువారం నుంచి నేను అనారోగ్యంగా ఉన్నా. నా శరీరం తీవ్రంగా బాధపడుతోంది. కరోనా టెస్టులు చేయించుకున్నా. దురదృష్టవశాత్తూ కరోనా పాజిటివ్‌గా తేలింది. త్వరగా కోలుకోవడానికి ప్రార్థనలు కావాలి’ అని అఫ్రిది ట్విట్టర్‌‌లో పోస్ట్ చేశాడు.

కరోనా ఫండ్ రైజింగ్‌లో భాగంగా మే నెల మొదట్లో బంగ్లాదేశ్ క్రికెటర్ ముష్ఫికర్ రహీం బ్యాట్‌ను ఆక్షన్‌లో అఫ్రిది కొన్నాడు. ‘ముష్ఫికర్ రహీంకు ఓ బయ్యర్ దొరికారు. మంచి కార్యక్రమంలో పాక్ మాజీ ఆల్‌రౌండర్ అఫ్రిది భాగమయ్యాడు. ఛారిటీ ఫౌండేషన్ తరఫున బ్యాట్‌ను అఫ్రిది కొన్నాడు’ అని ఐసీసీ ట్వీట్ చేసింది. కరోనా క్రైసిస్‌లో అఫ్రిది ప్రజలకు చాలా సాయం అందించాడు. గత రెండు నెలల కాలంలో వేలాది మంది పేదలకు రేషన్‌తోపాటు ఇతర నిత్యావసర సరుకులను ఇచ్చాడు.