ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు.. సీబీఐకి నోటీసులిచ్చిన హైకోర్టు

  ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు..  సీబీఐకి నోటీసులిచ్చిన హైకోర్టు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణను మే 24వ తేదీకి వాయిదా వేసింది ఢిల్లీ హైకోర్టు. కవిత్ బెయిల్ పై కౌంటర్ దాఖలు చేయాలంటూ సీబీఐకి నోటీసులు జారీ చేసింది. లిక్కర్ స్కాం ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ ఇవ్వాలంటూ.. ఇటీవల రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు కవిత. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు.. ఈనెల 20వరకు కవితకు రిమాండ్ విధిస్తూ.. తీర్పు వెల్లడించింది. దీంతో మరోసారి బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టు ఆశ్రయించారు కవిత. లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన కవిత ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్నారు. 

ఢిల్లీ లిక్కర్ స్కామ్​లో దాదాపు 46 రోజులుగా కవిత తీహార్ జైల్లోని కాంప్లెంక్స్ 6 (మహిళ ఖైదీలు ఉండే కాంప్లెక్స్) లో ఉంటున్నారు. కోర్టు అనుమతితో పలు పుస్తకాలను చదువుతూ... ధ్యానం, ఆధ్యాత్మిక చింతనలో గడుపుతున్నారు. 

కాగా తనను ఈడీ, సీబీఐ అరెస్ట్  చేయడాన్ని సవాల్ చేస్తూ, బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత దాఖలు చేసిన మధ్యంతర, రెగ్యులర్ బెయిల్ పిటిషన్లను  ఇప్పటికే కోర్టు తిరస్కరించింది. దీంతో ఢిల్లీ హైకోర్టును ఆమె ఆశ్రయించారు.  ఈ పిటిషన్ పై ఇటీవల విచారణ జరిపిన జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం.. విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది