ముచ్చింతల్ లో ఒడిశా సీఎం..స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ సందర్శన

ముచ్చింతల్ లో ఒడిశా సీఎం..స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ సందర్శన

శంషాబాద్, వెలుగు: శంషాబాద్ మండలం ముచ్చింతల్​లోని చిన జీయర్ స్వామి ఆశ్రమం, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ, ఆయన కుటుంబసభ్యులు శనివారం సందర్శించారు. సీఎం దంపతులకు ఆలయ పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. చిన జీయర్ స్వామి శాలువాతో సత్కరించి రామానుజ స్వామి ప్రతిమ, తీర్థ ప్రసాదాలు, మంగళ శాసనాలు అందజేశారు. 

అనంతరం 108 దివ్య క్షేత్రాలు, 216 అడుగుల స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, స్వర్ణ రామానుజాచార్య విగ్రహాన్ని సందర్శించారు. సాయంత్రం డైనమిక్ మ్యూజికల్ ఫౌంటెన్ షో, లేజర్ షోలో పాల్గొన్నారు. కార్యక్రమంలో మై హోం సంస్థ అధ్యక్షుడు జూపల్లి రామేశ్వర రావు, ఆయన కుమారుడు ఉన్నారు.