పెట్టుబడి పెడితే డబ్బులు డబుల్ అంటూ.. రూ.3 లక్షలు టోకరా

పెట్టుబడి పెడితే  డబ్బులు డబుల్ అంటూ..  రూ.3 లక్షలు టోకరా

బోధన్, వెలుగు : పెట్టుబడి పెడితే డబ్బులు డబుల్ వస్తాయంటూ సైబర్​ నేరగాళ్లు రూ.3 లక్షలు దోచుకున్నారు. ఎస్సై మచ్ఛేందర్ రెడ్డి వివరాల ప్రకారం.. మండలంలోని ఊట్ పల్లి గ్రామానికి చెందిన మహిళకు కొద్ది రోజుల కింద గుర్తుతెలియని టెలిగ్రామ్ ద్వారా వ్యక్తి పరిచయమయ్యాడు. ఈ యాప్​లో పెట్టుబడి పెడితే డబ్బులు డబుల్​ ఇస్తామని నమ్మబలికాడు. 

దీంతో అతడి మాటలు నమ్మి విడతల వారీగా రూ.3,06,466 పంపించింది. తిరిగి డబ్బులు రాకపోవడంతో ఫోన్​చేస్తే స్విచ్​ఆఫ్​ వచ్చింది. దీంతో మోసపోయానని గ్రహించి బోధన్​ రూరల్​ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సైబర్​ నేరస్తుడి అకౌంట్​లో ఉన్న రూ.38,478 పోలీసులు ఫ్రీజ్ చేశారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.