మన్నెంపల్లి లో వీరగల్లు విగ్రహం లభ్యం

మన్నెంపల్లి లో వీరగల్లు విగ్రహం లభ్యం

తిమ్మాపూర్, వెలుగు: భీకర యుద్ధ సన్నివేశాన్ని తెలిపే వీరగల్లు విగ్రహం మన్నెంపల్లి గ్రామంలో బయటపడింది. స్థానిక పాల కేంద్రం పరిసరాలను శనివారం ఉదయం శుభ్రం చేస్తుండగా పాలకేంద్రం అధ్యక్షుడు పోతుగంటి సంపత్ వీరగల్లును గుర్తించాడని చరిత్ర పరిశోధకుడు ‘డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి’ తెలిపారు. ఒకటిన్నర ఫీట్ల ఎత్తులోనే నల్లసరం బండపై శిల్పం అద్భుతంగా చెక్కబడిందన్నారు.

 దిగువన ఒక సైనికుడు కుడి చేతిలో కత్తి, ఎడమ చేతిలో కళ్లెం పట్టుకుని గుర్రం ముందరి కాళ్లతో శత్రు సైనికుడిని పడగొట్టగా, మరో సైనికుడు ఏనుగుపై ఉన్నాడన్నారు. ఈ శిల్ప శైలిని బట్టి చూస్తే వేములవాడ చాళుక్యుల కాలం నాటిదని తెలుస్తోందని చెప్పారు.