మీడియాలో అపెక్స్ కమిటీ అవసరం : కె.వి విజయేంద్ర ప్రసాద్

మీడియాలో అపెక్స్ కమిటీ అవసరం : కె.వి విజయేంద్ర ప్రసాద్

హైదరాబాద్ సిటీ, వెలుగు: మీడియా రంగంలో నైతిక విలువలు, విశ్వసనీయత పెంపొందించేందుకు స్వతంత్ర అపెక్స్ కమిటీ ఏర్పాటు అవసరమని ప్రఖ్యాత సినీ రచయిత, రాజ్యసభ సభ్యుడు కె.వి. విజయేంద్ర ప్రసాద్ అభిప్రాయపడ్డారు.హైదరాబాద్ ప్రెస్ క్లబ్​లో శనివారం జరిగిన జర్నలిస్టులతో ముఖాముఖిలో ఆయన మాట్లాడారు. 

మేధావులు, మాజీ న్యాయమూర్తులు, జర్నలిస్టులతో కూడిన కమిటీ ద్వారా మంచి జర్నలిజాన్ని ప్రోత్సహించి తప్పుడు సమాచారాన్ని నియంత్రించవచ్చన్నారు హైదరాబాద్​లో ముందుగా కమిటీ ప్రారంభించి తర్వాత దేశవ్యాప్తంగా విస్తరించవచ్చని తెలిపారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు విజయ్‌కుమార్ రెడ్డి ఈ ప్రతిపాదనను స్వాగతిస్తూ పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. సీనియర్ జర్నలిస్ట్ స్వప్న, రమేశ్ వరికుప్పల, రమేశ్ వైట్ల తదితరులు పాల్గొన్నారు.