మేడిబావిలో పాత బంగ్లా కూల్చివేత..దెయ్యాల వదంతులకు చెక్

మేడిబావిలో పాత బంగ్లా కూల్చివేత..దెయ్యాల వదంతులకు చెక్

పద్మారావునగర్, వెలుగు: సీతాఫల్మండి డివిజన్ మేడిబావిలో గత కొన్నేండ్లుగా ఖాళీగా ఉన్న పాత బూత్ బంగ్లాను అధికారులు శనివారం కూల్చివేశారు. ఇందులో దెయ్యాలు ఉన్నాయన్న వదంతులతో స్థానికులు ఇన్నాళ్లు భయాందోళనలకు గురయ్యారు. ప్రజల నుంచి పలుమార్లు వచ్చిన ఫిర్యాదులతో అధికారులు కూల్చివేత పనులు చేపట్టారు. కూల్చివేత పనులను కార్పొరేటర్ డాక్టర్ సామల హేమ పరిశీలించారు.