సాధారణంగా పెద్ద పెద్ద సిటీల్లో అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలతో పాటు సాధారణ బస్తీల్లో కూడా పార్కింగ్ విషయంలో గొడవలు జరుగుతుంటాయి. ఇవి మనం చూస్తున్నవే..అయితే ఈ గొడవలు ముదిరి ఒక్కోసారి ప్రాణాల మీదకు కూడా తెస్తుంటాయి. ఎంత ఘోరంగా అత్యంత కిరాతంగా చంపే స్థాయికి వెళుతుంటాయి.. చిన్న చిన్ని గొడవలే క్షణికావేశంతో దారుణ హత్యలకు దారితీస్తుంటాయి. అటాంటిదే ఇటీవల గురుగ్రామ్ లోని సోహ్నారోడ్ లో జరిగింది. అర్థరాత్రి పార్కింగ్ విషయం లో పక్కపక్కన నివసించే వ్యక్తులపై అత్యంత కిరాతంగా కారు ఎక్కించాడు.ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు గాయపడ్డారు..వీరిలో ఒకరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. చిన్న గొడవే.. కానీ తీవ్రస్థాయికి చేరి ప్రాణాలు తీసింది.
మే 12న హర్యాలోని గురుగ్రామ్ లో 31 ఏళ్ల రిషబ్ జసూజా అనే వ్యక్తిని పొరుగున నివసించే మనోజ్ దారుణంగా చంపాడు. అతని పొరుగున నివసిస్తున్న రిషబ్ జసూకా మిలీని కారుతో ఢీకొట్టి స్పీడ్ గా కొన్ని మీటర్ల దూరం ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటనలో రిషబ్ జసూజా మృతిచెందగా అతని సోదరుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడు తున్నాడు. రిషబ్ తల్లి స్వల్పగాయాలతో బయటపడింది.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం..ఆదివారం అర్థరాత్రి ఫ్యామిలితో కలిసి వచ్చిన రిషబ్ ఫ్యామిలీకి మనోజ్ కి మధ్య పార్కింగ్ విషయంలో గొడవ జరిగింది. ఈ క్రమంలో మనోజ్ కొందరు స్నేహితులను పిలిపించి రిషబ్ ఫ్యామిలీపై దాడి చేశాడు. అంతటితో ఆగకుండా మనోజ్ తన హ్యుందాయ్ క్రెటా కారుతో రిషబ్ తో పాటు అతని సోదరుడు, తల్లిపై ఢీకొట్టాడు.. కొంత దూరం ఈడ్చుకెళ్లాడు.
ఇదంతా సీసీటీసీ కెమెరాల్లో రికార్డు అయింది.. సోషల్ మీడియాలో వైరల్ అయింది. రిషబ్ పైకి మనోజ్ కారుతో దూసుకెళ్లిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో కనిపించాయి.
రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు మనోజ్ భరద్వాజ్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులను త్వరలో పట్టుకుంటామని తెలిపారు.
गुरुग्राम-पार्किंग को लेकर हुए विवाद में IT मैनेजर की कार से कुचलकर हत्या, मां और भाई घायल #death #car#gurugram #Gurugram #Hariyana #parking pic.twitter.com/C6GSvPzYXP
— Nidhi solanki?? (@iNidhisolanki) May 16, 2024
