Pushpa 2: ఈ క్రేజ్ ఏంది సామీ.. ముంబై లోకల్ ట్రైన్ లో పుష్ప రాజ్ మ్యానియా

Pushpa 2: ఈ క్రేజ్ ఏంది సామీ.. ముంబై లోకల్ ట్రైన్ లో పుష్ప రాజ్ మ్యానియా

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప 2(Pushpa 2). పుష్ప పార్ట్ 1 భారీ విజయం సాధించిన నేపథ్యంలో పార్ట్ 2పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకే ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది. ఇక ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కానుండగా ప్రమోషన్స్ లో  భాగంగా పుష్ప 2 నుండి మొదటి సాంగ్ విడుదల చేశారు మేకర్స్. పుష్ప.. పుష్ప.. పుష్పరాజ్ అంటూ సాగిన ఈ పాట కూడా భారీ విజయాన్ని సాధించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో, ఇన్స్టాలో, యూట్యూబ్ ల్లో ఎక్కడ చూసినా పుష్పరాజ్ సాంగ్ రీల్స్ కనిపిస్తున్నాయి. 

మరీ ముఖ్యంగా పాటలో అల్లు అర్జున్ చెప్పు వదిలేసి చేసే స్టెప్పు బాగా వైరల్ అవుతోంది. చాలామంది ఈ స్టెప్ తో రీల్స్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. తాజాగా మరో వ్యక్తి అదే స్టెప్ వేసి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. అది కూడా లోకల్ ట్రైన్ లో. అవును.. ముంబై లోకల్ ట్రైన్ ఆ వ్యక్తి ప్యాసింజర్స్ తో కలిసి పుష్ప పాటకు స్టెప్ వేయించాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లక్షల వ్యూస్ తో దూసుకుపోతోంది ఈ రీల్. ఇక ఈ వీడియో చూసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇది ఇది ఐకాన్ స్టార్ క్రేజ్ అంటే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి రిలీజ్ కు ముందే ఈ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందటే.. రిలీజ్ తరువాత ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో ఈ సినిమా.