శంకరపట్నం, వెలుగు: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ గ్రామంలో పూర్వ ప్రజా ప్రతినిధులను సన్మానించారు. బుధవారం గ్రామ సర్పంచ్ దుర్గపు సుజాత–తిరుపతి పూర్వ ప్రజా ప్రతినిధుల సన్మాన కార్యక్రమం నిర్వహించి , 1956లో తాడికల్ గ్రామపంచాయతీ ఏర్పడినప్పటి నుంచి సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీలుగా పనిచేసిన ప్రజా ప్రతినిధులకు శాలువాలు కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి సర్పంచ్, మాజీ ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని అన్నారు .

