
రెవెన్యూ అధికారుల అక్రమాలకు నిరసనగా… మహబూబాబాద్ జిల్లా పెరుమాళ్ళ సంకీసలో… ఓ రైతు వినూత్న నిరసనకు దిగాడు. భుజాల వరకు మట్టిలో పూడ్చుకుని… 72 గంటల పాటు నిరసన తెలుపుతున్నాడు రైతు నాగేందర్ రెడ్డి. తనకు వారసత్వంగా వస్తున్న భూమిని కొందరు రెవెన్యూ అధికారులు, కాసుల కోసం ఇష్టానుసారంగా మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. రెండేళ్ళ నుంచి రికార్డుల ట్యాంపరింగ్ జరిగిందని, తహసీల్దార్ కార్యాలయంలో ఉండాల్సిన రికార్డులు మాయం చేశారని ఆరోపిస్తున్నాడు. తనకు అన్యాయం చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాడు.