తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ టీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణభవన్ లో కేటీఆర్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. కేటీఆర్ రమణకు పార్టీ ప్రాథమిక సభ్యత్వం ఇచ్చారు. 16న హుజురాబాద్ సభలో కేసీఆర్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకుంటారు. ఇటీవలే ప్రగతి భవన్ లో కేసీఆర్ ను కలిసిన ఎల్ రమణ టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు.
