కామారెడ్డి జిల్లాలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ స్కూల్నిర్మాణానికి శంకుస్థాపన

 కామారెడ్డి జిల్లాలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ స్కూల్నిర్మాణానికి శంకుస్థాపన

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రూ.200 కోట్లతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్​రెసిడెన్సియల్​స్కూల్​కు శుక్రవారం లింగంపేట మండలం మోతే శివారులో శంకుస్థాపన చేశారు. జహీరాబాద్​ఎంపీ బీబీపాటిల్, ఎమ్మెల్యే కె.మదన్​మోహన్​రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, కలెక్టర్​ఆశిష్​సంగ్వాన్, ఎస్పీ రాజేశ్ చంద్ర తదితరులు పాల్గొని శంకుస్థాపన చేశారు. వారు మాట్లాడుతూ.. అన్ని వర్గాల విద్యార్థులకు ఒకే చోట నాణ్యమైన విద్య అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్​ రెసిడెన్సియల్ స్కూల్స్​ ఏర్పాటు చేస్తోందన్నారు.