నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయిస్తా

నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయిస్తా

ఆర్మూర్, వెలుగు: నియోజకవర్గ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయిస్తానని ఆర్మూర్​ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి అన్నారు. గురువారం ఆలూరులో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను 40 మంది లబ్ధిదారులకు పంపిణి చేశారు.

 అనంతరం మాట్లాడుతూ.. గుత్ప నుంచి ఆలూర్​కు, కల్లెడ నుంచి ఆలూర్ కు, ఆలూరు నుంచి గుత్పకు డబుల్ లైన్ రోడ్లు మంజూరు చేయించానని చెప్పారు. ఆలూర్​ గ్రామానికి బైపాస్ రోడ్డు అవసరమని, ఏకాభిప్రాయంతో ముందుకు వస్తే నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచులు విజయ్, సుస్మిత, నర్సయ్య, హరీశ్, మల్లయ్య, యాదగిరి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.