నిజామాబాద్ జిల్లాలో.. ముగ్గురు ఎన్ఎస్యూఐ నేతల సస్పెన్షన్

నిజామాబాద్ జిల్లాలో.. ముగ్గురు ఎన్ఎస్యూఐ నేతల సస్పెన్షన్

నిజామాబాద్, వెలుగు: జిల్లా కాంగ్రెస్​ ఆఫీస్​లో స్టేట్​ కో ఆపరేటివ్​ డెవలప్​మెంట్​ లిమిటెడ్​ చైర్మన్​ మానాల మోహన్​రెడ్డి బర్త్​డే జరుపుకోవడం వివాదం రేపింది. బుధవారం ఏఐసీసీ ఆదేశాల మేరకు డీసీసీ ఆఫీస్​లో యూత్​ కాంగ్రెస్​ నేతలు రైతులకు మద్దతుగా కిసాన్​ న్యాయ్​ సత్యాగ్రహ దీక్షలు చేశారు. ఈ శిబిరంలో మానాల మోహన్​రెడ్డి బర్త్​డే నిర్వహించడానికి ఎన్ఎస్​యూఐ మాజీ స్టేట్​ జనరల్​ సెక్రటరీ వరదబట్టు వేణురాజ్, పుండ్రసాయికుమార్, నరేన్​ దీప్​ ఏర్పాట్లు చేయగా డీసీసీ అధ్యక్షుడు నగేశ్​రెడ్డి అభ్యంతరం తెలిపారు. 

ఎన్ఎస్​యూఐ నేతలు వాదనకు దిగారు. అనంతరం డీసీసీ ఆఫీస్​ ప్రాంగణంలో మానాల మోహన్​రెడ్డి కేక్​ కోశారు. దీనిని పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనగా  పరిగణిస్తూ వేణురాజ్, పుండ్రసాయికుమార్, నరేన్​దీప్​ను పార్టీ నుంచి నగర ప్రెసిడెంట్​ బొబ్బిలి రామకృష్ణ సస్పెండ్​ చేశారు. వారి ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేశామని, తమ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని తెలిపారు.