హైదరాబాద్‌ లో రూ.40 లక్షలు లూటీ చేసిన దొంగలు అరెస్టు

హైదరాబాద్‌ లో రూ.40 లక్షలు లూటీ చేసిన దొంగలు అరెస్టు
  • నలుగురిని రిమాండ్​కు పంపిన పోలీసులు

ఓల్డ్​సిటీ వెలుగు: పాతబస్తీతో ఓ ఇంట్లోకి చొరబడి కత్తులతో బెదిరించి రూ.40 లక్షలు టాటీ చేసిన కేసులో నలుగురు దొంగలను పోలీసులు అరెస్ట్​ చేశారు. శుక్రవారం మీర్​చౌక్​ ఏసీపీ కార్యాలమయంలో ఏసీపీ జి.శ్యాం సుందర్​ వివరాలు వెల్లడించారు. భవాని నగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని అమన్​ నగర్​‌‌‌‌ బీలో నవంబర్​ 30న మహమ్మద్​ సుల్తాన్ ఇంట్లోకి గుర్తుతెలియని దొంగలు చొరబడ్డారు. 

ఆయనను కత్తులతో బెదిరించి రూ.40 లక్షలతో పాటు బైక్​ను ఎత్తుకెళ్లారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు భవానినగర్​ తలాబ్​ కట్టకు చెందిన సయ్యద్​ ఇర్పాన్​, ముదస్సిర్​ అలాహి(19), మొహమ్మద్​ జాహిద్​(37), మైలార్​దేవ్​పల్లికి చెందిన బిహార్​వాసి అబ్దుల్​ రెహమాన్(25)ను నిందితులుగా గుర్తించారు. వీరిని అరెస్టు చేసి రూ.34 లక్షల 66 వేలు రికవరీ చేశారు.

 కత్తి, ఐదు బైక్​లు, ఐదు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఐదు రోజుల్లో నిందితులు రూ.5 లక్షల 44 వేలు జల్సాలకు ఖర్చు చేశారు. దొంగలను పట్టుకోవడంలో ప్రతిభ చాటిన సౌత్​ జోన్​ టాస్క్​ ఫోర్స్​, భవాని నగర్​, రెయిన్​బజార్​, మీర్​చౌక్​ పోలీసులు బృందాన్ని ఏసీపీ శ్యాంసుందర్​ అభినందించారు. సమావేశంలో భవానినగర్​​ సీఐ బాలస్వామి, మీర్​చౌక్​ సీఐ సురేష్​ కుమార్​ పాల్గొన్నారు.