పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు.. నలుగురు కాంగ్రెస్ నాయకుల బహిష్కరణ

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు.. నలుగురు కాంగ్రెస్ నాయకుల బహిష్కరణ

శామీర్​పేట, వెలుగు: అలియాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన నలుగురు నాయకులను పార్టీ నుంచి బహిష్కరిస్తూ డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేశ్ యాదవ్ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ అభ్యర్థులకు కాకుండా ఇతర పార్టీలకు మద్దతు తెలిపిన ముద్ధం కిట్టు కుమార్ రెడ్డి, జమాల్ పూర్ సంతోష్, ముద్ధం రాజా రెడ్డి, సంఘమైన వినోద్​పై స్థానిక నాయకుల ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు తుంకి రమేశ్ తెలిపారు.