నాలుగు రోజులు మోస్తరు వానలు

నాలుగు రోజులు మోస్తరు వానలు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో పలు చోట్ల శనివారం నుంచి నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే చాన్స్‌‌‌‌ ఉందని హైదరాబాద్‌‌‌‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆగ్నేయ బంగాళా ఖాతంలో ఏర్పడిన వాయుగుండం శుక్రవారం పుదుచ్చేరి, చెన్నై తీరాన్ని దాటి, వెల్లూరుకు ఆగ్నేయ దిశగా కేంద్రీకృతమైందని చెప్పింది. కాగా, శుక్రవారం రాష్ట్రంలోని ఒకటి, రెండు చోట్ల తేలికపాటి జల్లులు కురిశాయని వెల్లడించింది.