నల్గొండ జిల్లాలో కొనుగోలు కేంద్రాల ఇన్ చార్జిల సస్పెన్షన్ : కలెక్టర్ బి.చంద్రశేఖర్

నల్గొండ జిల్లాలో కొనుగోలు కేంద్రాల ఇన్ చార్జిల సస్పెన్షన్ : కలెక్టర్ బి.చంద్రశేఖర్
  •     ధాన్యం వివరాలు నమోదు చేయనందుకు నలుగురిపై వేటు

నల్గొండ, వెలుగు: ధాన్యం వివరాలను ట్యాబ్‌‌లో నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహించినందుకు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు చెందిన నలుగురు ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను కలెక్టర్ బి.చంద్రశేఖర్ శుక్రవారం సస్పెండ్ చేశారు. నల్గొండ మండలం పెద్ద సూరారం, నార్కెట్‌‌పల్లి మండలం బాచకుంట, త్రిపురారం, చండూరు పీఏసీఎస్​ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని ట్యాబ్‌‌లో నమోదు చేయలేదని గుర్తించారు. 

ఈ విషయంపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంబంధిత కేంద్రాలకు చెందిన నలుగురు పీఏసీఎస్​ ఇన్‌‌చార్జిలను విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.