IND vs SA: సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు టీమిండియాలో భారీ మార్పులు.. రీ ఎంట్రీ ఇచ్చిన నాలుగు ప్లేయర్స్ వీరే!

IND vs SA: సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు టీమిండియాలో భారీ మార్పులు.. రీ ఎంట్రీ ఇచ్చిన నాలుగు ప్లేయర్స్ వీరే!

సౌతాఫ్రికాతో జరగబోయే మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ కు 15 మంది సభ్యుల భారత జట్టును బీసీసీఐ ఆదివారం (నవంబర్ 23) ప్రకటించింది. సీనియర్ ప్లేయర్ కేఎల్ రాహుల్ కు కెప్టెన్సీ అప్పగించారు. రెగ్యులర్ కెప్టెన్ శుభమాన్ గిల్.. వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ గాయాల కారణంగా దూరమయ్యారు. నవంబర్ 30 నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్ కు భారత జట్టులో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. సీనియర్ ప్లేయర్స్ తో పాటు యంగ్ క్రికెటర్లు జట్టులోకి కంబ్యాక్ ఇచ్చారు. వారెవరో ఇప్పుడు చూద్దాం.. 

1) రిషబ్ పంత్:

టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఏడాది తర్వాత టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. స్వదేశంలో సౌతాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్ లో చోటు దక్కించుకున్నాడు. చివరిసారిగా టీమిండియా తరపున 2024 ఆగస్టులో శ్రీలంకతో వన్డే సిరీస్ ఆడిన పంత్.. ఆ తర్వాత గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ కు దూరమయ్యాడు. ప్రస్తుతం పంత్ పూర్తిగా ఫిట్ నెస్ సాధించడంతో మళ్ళీ వన్డే జట్టులోకి తిరిగొచ్చాడు. ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో పంత్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. 

2) రవీంద్ర జడేజా

అక్టోబర్ లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ లో రవీంద్ర జడేజాను పక్కన పెట్టి సెలక్టర్లు ఊహించని షాక్ ఇచ్చారు. అక్షర్ పటేల్, సుందర్ ను ఆసీస్ సిరీస్ కు ఎంపిక చేశారు. దీంతో జడేజా వన్డే కెరీర్ ముగిసిందనే అభిప్రాయలు వచ్చాయి. అయితే స్వదేశంలో జరగనున్న సౌతాఫ్రికా సిరీస్ కు ఈ సీనియర్ ఆల్ రౌండర్ ను సెలక్టర్లు ఎంపిక చేశారు. జడేజా వన్డేల్లో చివరిసారిగా ఈ ఏడాది ప్రారంభంలో ఛాంపియన్స్ లో ఆడాడు. జడేజా జట్టులోకి రావడంతో ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ పై వేటు పడింది. 

3) రుతురాజ్ గైక్వాడ్: 

మహారాష్ట్ర బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ రెబదేళ్ళ తర్వాత భారత జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. స్వదేశంలో సౌతాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్ లో రిజర్వ్ ఓపెనర్ గా  స్క్వాడ్ లో స్థానం సంపాదించుకున్నాడు. 2023లో చివరిసారిగా గైక్వాడ్ భారత వన్డే జట్టులో కనిపించాడు. సౌతాఫ్రికాతో ఒక వన్డే ఆడిన గైక్వాడ్.. రెండేళ్ల తర్వాత మరోసారి సఫారీలపైనే కంబ్యాక్ ఇచ్చాడు. ఇటీవలే సౌతాఫ్రికా -ఏ తో జరిగిన వన్డే సిరీస్ లో అద్భుతంగా రాణించిన గైక్వాడ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా ఎంపికయ్యాడు. టీమిండియా కెప్టెన్ శుభమాన్ గిల్ కు గాయం కావడంతో ఓపెనర్ గా గైక్వాడ్ కు ఛాన్స్ దక్కింది. 

4) తిలక్ వర్మ:

తెలుగు కుర్రాడు తిలక్ వర్మ రెబదేళ్ళ తర్వాత భారత వన్డే జట్టులో ఎంపికయ్యాడు. మిడిల్ ఆర్డర్ లో శ్రేయాస్ అయ్యర్ గాయం కారణంగా దూరం కావడంతో తిలక్ వర్మకు జట్టులో అవకాశం దక్కింది. గైక్వాడ్ లాగే 2023లో చివరిసారిగా భారత వన్డే జట్టులో కనిపించాడు. సౌతాఫ్రికాతో ఒక వన్డే ఆడిన గైక్వాడ్.. రెండేళ్ల తర్వాత మరోసారి సఫారీలపైనే కంబ్యాక్ ఇచ్చాడు. తుది జట్టులో తిలక్ కు అవకాశం దక్కడం కష్టంగానే కనిపిస్తోంది.   


సౌతాఫ్రికాతో మూడు వన్డేలకు భారత జట్టు:

రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ , నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, రుతురాజ్ గైక్వాడ్, ప్రసిద్ కృష్ణ, అర్షదీప్ సింగ్, ధృవ్ జురెల్