
ది ఓవల్‌లో భారత్ తో జరుగుతున్న ఐదవ టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ ఆలౌట్ అయింది. మహమ్మద్ సిరాజ్ ,ప్రసిద్ధ్ కృష్ణ చెరో నాలుగు వికెట్లు పడగొట్టడంతో ఇంగ్లాండ్ 247 పరుగులకు ఆలౌటైంది. మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ పై 23 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది. క్రాలే 64, బ్రూక్ 53, డకెట్ 43, రూట్ 29, పోప్ 22 రన్స్ తో ఆకట్టుకున్నారు. గాయం కారణంగా క్రిస్ వోక్స్ ఆబ్సెంట్ హర్ట్ కావడంతో 9 వికెట్లకే ఇంగ్లండ్ ను ఆలౌట్ గా ప్రకటించారు.
అనంతరం 2వ రోజు చివరి సెషన్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో ఇన్నింగ్స్‌లో భారత్ బ్యాటింగ్‌కు దిగింది. యశస్వి జైస్వాల్ ,కెఎల్ రాహుల్ క్రీజులో ఉండటంతో భారత్ 6 ఓవర్లు ముగిసే సమయానికి 28/0 స్కోరుతో ఇంగ్లాండ్ కంటే 5 పరుగుల ఆధిక్యంలో ఉంది.
►ALSO READ | IND vs ENG 2025: సిరాజ్, ప్రసిద్ విజృంభణ.. రెండో రోజే రసవత్తరంగా ఓవల్ టెస్ట్
అంతకుముందు ఇంగ్లాండ్‌ను భారత్ 247 పరుగులకే ఆలౌట్ చేసింది.భారతదేశం తొలి ఇన్నింగ్స్ మొత్తం 224 కంటే కేవలం 23 పరుగులు మాత్రమే ఎక్కువగా చేయగలిగింది. ఓపెనర్లు జాక్ క్రాలే ,బెన్ డకెట్ చేసిన అద్భుతమైన ఆరంభం తర్వాత, భారత పేసర్లు మహమ్మద్ సిరాజ్ ,ప్రసిద్ధ్ కృష్ణ భారత్‌ను తిరిగి ఆటలోకి తీసుకువచ్చారు.చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు.
క్రాలే ,హ్యారీ బ్రూక్ ఇంగ్లాండ్ తరపున హాఫ్ సెంచరీలు చేశారు. శుభ్‌మాన్ గిల్ నేతృత్వంలోని భారత్ ఇప్పుడు మెరుగైన బ్యాటింగ్ ప్రదర్శనను ప్రదర్శించాలని లక్ష్యంగా పెట్టుకుంది.ఈ మ్యాచ్ సిరీస్‌ను సమం చేయడానికి తప్పనిసరిగా గెలవాలి.