
ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఓవల్ టెస్టులో టీమిండియా గాడిలో పడింది. బ్యాటింగ్ లో ఘోరంగా విఫలమైన మన జట్టు బౌలింగ్ లో అద్భుతంగా రాణిస్తోంది. ఫాస్ట్ బౌలర్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ విజృంభించడంతో ఇంగ్లాండ్ కూడా ఇండియా దారిలోనే నడుస్తుంది. రెండో రోజు టీ సమయానికి 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 9 పరుగులు వెనకబడి ఉంది. క్రీజ్ లో అట్కిన్సన్ (0), హ్యారీ బ్రూక్ (33) ఉన్నారు. మూడో సెషన్ లో భారత బౌలర్లు విజృంభిస్తే ఇంగ్లాండ్ కు భారీ ఆధిక్యం దక్కకుండా చూడొచ్చు.
భారత బౌలర్లలో సిరాజ్,ప్రసిద్ కృష్ణ మూడు వికెట్లు తీసుకోగా.. ఆకాష్ దీప్ కు ఒక వికెట్ దక్కింది. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ కు అదిరిపోయే ఆరంభం లభించింది. ఓపెనర్లు బెన్ డకెట్, జాక్ క్రాలీ (64) తొలి వికెట్ కు 92 పరుగులు జోడించి సూపర్ స్టార్ట్ ఇచ్చారు. వేగంగా ఆడుతున్న డకెట్ (43) ను ఆకాష్ దీప్ ఔట్ చేసి టీమిండియాకు తొలి వికెట్ అందించాడు. లంచ్ తర్వాత హాఫ్ సెంచరీ చేసిన క్రాలీని ప్రసిద్ పెవిలియన్ కు చేర్చాడు. ఆ తర్వాత సిరాజ్ ఇంగ్లాండ్ బ్యాటర్లను వణికించాడు. తన పదునైన బంతులతో పోప్ (22), రూట్ (29), బెతేల్ (6) ను స్వల్ప వ్యవధిలో ఔట్ చేసి ఇంగ్లాండ్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు.
►ALSO READ | IND vs ENG 2025: సంవత్సరాలు గడుస్తున్నా నా కొడుకుని పట్టించుకోవట్లేదు: బీసీసీఐపై క్రికెటర్ తండ్రి ఫైర్
పోప్, రూట్, బెతేల్ ముగ్గురూ కూడా సిరాజ్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ రూపంలో ఔటవ్వడం విశేషం. టీ విరామానికి ముందు ప్రసిద్ కృష్ణ ఇంగ్లాండ్ కు ఊహించని షాక్ ఇచ్చాడు. ఒకే ఓవర్లో జెమీ స్మిత్ (8) తో పాటు జెమీ ఓవర్దన్ (0) వికెట్లను తీశాడు. దీంతో ఇంగ్లాండ్ ఏడు వికెట్లను కోల్పోయింది. జోష్ టంగ్, అట్కిన్సన్ విజృంభించడంతో తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా కేవలం 224 పరుగులకే ఆలౌట్ అయింది. కరుణ్ నాయర్ 57 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు.
Siraj takes three to lead India's afternoon fightback at The Oval!
— ESPNcricinfo (@ESPNcricinfo) August 1, 2025
Ball-by-ball: https://t.co/rrZF1qeH0S pic.twitter.com/vFbLnqqqW0