ఆత్మహత్య చేసుకున్న నాలుగేళ్లకు సర్కార్ కొలువు

ఆత్మహత్య చేసుకున్న నాలుగేళ్లకు సర్కార్ కొలువు

మంచిర్యాల జిల్లా మందమర్రిలో ఓ అభ్యర్థి చనిపోయిన నాలుగేళ్ల తరువాత ప్రభుత్వ ఉద్యోగ చివరి పరీక్షకు హాజరు కావాలని కాల్  లెటర్  వచ్చింది. NPDCL  లో జూనియర్  లైన్ మెన్  పోస్టుల భర్తీ కోసం 2018 లో అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించారు. 

మందమర్రికి చెందిన జీవన్ కుమార్ కు విద్యుత్తు స్తంభం ఎక్కే పరీక్షకు ఈ నెల 24న హాజరుకావాలని కాల్ లెటర్  వచ్చింది. కానీ అతను మరణించడంతో పోస్ట్ మ్యాన్  దానిని తిరిగి వెనక్కి పంపించారు. మందమర్రి మొదటి జోన్ కు చెందిన మొండయ్య-సరోజ దంపతులకు నవీన్ కుమార్, అనూష, ఆదిత్య, జీవన్ కుమార్  సంతానం. వారిలో ఇద్దరు కుమార్తెలు మానసిక దివ్యాంగులు. జీవన్ కుమార్   2014లో ఐటీఐ పూర్తి చేశాడు. అనారోగ్యంతో అక్క ఆదిత్య, తల్లి సరోజ మరణించారు. ఉద్యోగం రాకపోవడంతో జీవన్ కుమార్  2020 మార్చి 15న ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. తర్వాత అక్క అనూష, తండ్రి మొండయ్య చనిపోయారు. ఆరుగురు కుటుంబ సభ్యులున్న ఆ ఇంట్లో  వరుస మరణాలతో చివరకు పెద్ద కొడుకు నవీన్ ఒక్కరే మిగిలాడు.