నాలుగో రోజు నర్సుల ఆందోళన

నాలుగో రోజు నర్సుల ఆందోళన

హైద‌రాబాద్: ఔట్ సోర్సింగ్ న‌ర్సుల ఆందోళ‌న నాలుగో రోజుకి చేరింది. రెగ్యుల‌రైజ్ పై క్లారిటీ ఇచ్చేంత‌వ‌ర‌కు ఆందోళ‌న విర‌మించ‌మ‌ని డిమాండ్ చేస్తూ సోమ‌వారం గాంధీ హాస్పిట‌ల్ ముందు నిర‌స‌న వ్య‌క్తం చేస్తూ ఆందోళ‌న చేప‌ట్టారు ఔట్ సోర్సింగ్ న‌ర్సులు. ఇప్ప‌టికే జీతం పెంచుతామ‌ని ప్ర‌భుత్వం హామీ ఇచ్చినా..రెగ్యుల‌రైజ్ విష‌యంపై క్లారిటీ కావాల‌ని డిమాండ్ చేస్తున్నారు.
క‌రోనా స‌మ‌యంలో క‌ష్ట‌ప‌డి ప‌నిచేసిన త‌మ‌కు అన్యాయం చేయ‌డం త‌గ‌ద‌న్నారు. ఇప్ప‌టికైన ప్ర‌భుత్వం త‌మ ఉద్యోగాల‌ను ప‌ర్మినెంట్ చేయాల‌ని కోరుతున్నామ‌న్నారు ఔట్ సోర్సింగ్ న‌ర్సులు. ‌