i Phone 12 బ్యాన్ చేసిన ఫ్రాన్స్.. కారణాలు తెలిస్తే షాక్

i Phone 12 బ్యాన్ చేసిన ఫ్రాన్స్.. కారణాలు తెలిస్తే షాక్

మీరు యాపిల్ ఐఫోన్ 12 వాడుతున్నారా.. అయితే జాగ్రత్తగా ఉండాల్సిందే. ఐఫోన్ 12 నుంచి ఎక్కువ విద్యుదయాస్కాంత తరంగాలు వెలువడుతున్నా యట.  నిర్ధిష్ట శోషణ రేటు (SAR) చట్టపరమైన పరిమితికంటే ఎక్కువగా ఉండటంతో ఫ్రాన్స్‌లో iPhone 12ని అక్కడి ప్రభుత్వం నిషేధించింది. ఫ్రాన్స్ నేషనల్ ఫ్రీక్వె న్సీ ఏజెన్సీ(ANFR) మోడల్ అనుమతించిన దానికంటే ఎక్కువ విద్యుదయాస్కాంత తరంగాలు విడుదల చేస్తుందని ఐఫోన్ 12 ఫోన్ అమ్మకాలను నిలిపివేయాలని తెలిపింది. 

మూడేళ్ల నాటి ఆపిల్ ఐఫోన్లతో సహా 141 ఫోన్లను SAR పరీక్షించిన ఏజెన్సీ.. ఫోన్ ను జేబులో ఉంచినప్పుడు కిలో గ్రాముకు 5.74 వాట్ల శక్తి విడుదలైనట్లు గుర్తించారు. నిబంధన ప్రకారం.. SAR కోసం EU ప్రమాణం కిలోగ్రాముకు 4.0 వాట్స్ మాత్రమే. ఈ సమస్యను త్వరగా పరిష్కరించేందుకు Apple తప్పనిసరిగా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని లేదా యూరోపియన్ దేశంలో విక్రయించబడిన అన్ని ఫోన్లను రీకాల్ చేయాలని ANFR  ఆదేశించినట్లు  తెలిపింది.

కొన్ని అధ్యయనాల ప్రకారం.. క్యాన్సర్ ప్రమాదం నుండి వినియోగదారులను రక్షించడానికి యూరోపియన్ యూనియన్ ద్వారా SAR పరిమితులను ఉన్నాయని..  ANFR ద్వారా సేకరించబడిన డేటా ఇతర EU సభ్య దేశాలలోని రెగ్యులేటర్‌లకు పంపబడుతుందని బారోట్ Le Parisien తో చెప్పారు.