కూసు మంచిలో డ్రైవర్లకు కంటి చూపు పరీక్షలు

కూసు మంచిలో డ్రైవర్లకు కంటి చూపు పరీక్షలు

కూసుమంచి, వెలుగు: డ్రైవింగ్ వృత్తిలో కంటి చూపు చాలా కీలకమైనదని, కంటి చూపు బాగుంటేనే వాహనాన్ని సమర్ధవంతంగా నడపగలుగుతారని కూసుమంచి సీఐ సంజీవ్ అన్నారు. ఆదివారం కూసుమంచిలో ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా కొనసాగుతున్న అరైవ్ అలైవ్ మూడో విడత అవగాహన కార్యక్రమంలో భాగంగా రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి పర్యవేక్షణలో కూసుమంచి హైవేలో వెళ్తున్న భారీ వాహనాల డ్రైవర్లకు రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. శివ అప్టికల్స్ సహకారంతో కూసుమంచి ప్రభుత్వ పాఠశాలలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు.  కార్యక్రమంలో కూసుమంచి ఎస్సై నాగరాజు, పాల్గొన్నారు