హైదరాబాద్: మే నెలలో కూడా ప్రతి తెల్ల రేషన్ కార్డుదారుడికి 12 కిలోల బియ్యం, కుటుంబానికి రూ.1500 చొప్పున నగదు సాయం అందిస్తామని తెలిపారు సీఎం కేసీఆర్. ఆదివారం లాక్ డౌన్ పై ప్రెస్ మీట్ లో మాట్లాడిన సీఎం.. మే ఫస్ట్ వీక్ లోనే రేషన్ పంపిణీ చేస్తామన్నారు. 7వ తేదీ లోపే రూ.1500 ఖాతాలో జమ చేస్తామని తెలిపారు. గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్ .. తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ స్ అండ్ రీసెర్చ్ (టిమ్స్) గా మారబోతుందన్నారు.
అలాగే రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని.. తక్కువ ధరకు అమ్ముకుని రైతులు నష్టపోకూడదన్నారు. శనగలను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్న సీఎం.. ధాన్యం సేకరణ చాలా విజయవంతంగా కొనసాగుతోందన్నారు. మే 5 నుంచి రైతులు ఎరువులు కొనుగోలు చేసుకోవాలని సూచించారు సీఎం కేసీఆర్.
