ఏఎన్ హెచ్ఆర్సీ షార్ట్ ఫిల్మ్ -2026 పోటీలు..మే 30లోపు షార్ట్ ఫిల్మ్ లు పంపేందుకు అవకాశం 

ఏఎన్ హెచ్ఆర్సీ షార్ట్ ఫిల్మ్ -2026 పోటీలు..మే 30లోపు షార్ట్ ఫిల్మ్ లు పంపేందుకు అవకాశం 

హైదరాబాద్ సిటీ, వెలుగు: జాతీయ మానవ హక్కుల సంఘం(ఏఎన్ హెచ్ఆర్సీ) ఆధ్వర్యంలో మానవ హక్కులపై 12వ వార్షిక షార్ట్ ఫిల్మ్ -–2026 పోటీలు నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ డైరెక్టర్ జైమిని కుమార్ శ్రీవాస్తవ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పోటీల్లో హిందీ, ఇంగ్లిష్  లేదా ఇతర భారతీయ భాషల్లో చిత్రాలు, ఇంగ్లిష్ సబ్‌టైటిల్స్ తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. షార్ట్ ఫిల్మ్ వ్యవధి 3 నుంచి 10 నిమిషాల్లోపు ఉండాలని సూచించారు. ఉత్తమ చిత్రాలకు నగదు బహుమతులు అందజేస్తామని ప్రకటించారు.

మొదటి, రెండో, మూడో బహుమతులకు వరుసగా రూ.2 లక్షలు, రూ.1.5 లక్షలు, రూ.1 లక్షలు ఇవ్వనున్నట్లు వివరించారు. అదనంగా జ్యూరీ సిఫారసు మేరకు గరిష్టంగా నాలుగు సర్టిఫికెట్లు, ఒక్కొక్కటికి రూ.50 వేలు చొప్పున ప్రదానం చేస్తామని తెలిపారు. వయస్సుతో సంబంధం లేకుండా వివిధ ప్రాంతాల  పౌరుల నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు తమ షార్ట్ ఫిల్మ్స్​ను nhrcshortfilm@gmail.com కు ఈనెల 30లోపు పంపించాలని సూచించారు. మానవ హక్కులపై అవగాహన పెంచడం, సృజనాత్మకతను ప్రోత్సహించడం ఈ పోటీ ముఖ్యఉద్దేశమని తెలిపారు.