రాష్ట్ర అభివృద్ధిలో కార్మికుల పాత్ర కీలకం : మంత్రి శ్రీధర్ బాబు

రాష్ట్ర అభివృద్ధిలో కార్మికుల పాత్ర కీలకం :  మంత్రి శ్రీధర్ బాబు
  • ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు 

మంథని, వెలుగు: రాష్ట్ర అభివృద్ధిలో కార్మికుల పాత్ర కీలకమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌‌‌‌‌‌‌‌ బాబు పేర్కొన్నారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో పర్యటించి ప్రజలతో కాసేపు ముచ్చటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్మికుల, కర్షకులకు సమన్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు. కార్మికుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. మంథని మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులకు ఇల్లు లేని వారికి గుర్తింపు ఇచ్చి, త్వరలో వారికి ఇందిరమ్మ ఇల్లు అందిస్తామన్నారు. 

అనంతరం పట్టణంలోని జడ్పీ హైస్కూల్‌‌‌‌లో నిర్వహిస్తున్న సూపర్ సమ్మర్ క్యాంపులో విద్యార్థులతో మాట్లాడారు. టీ ఫైబర్ నెట్‌‌‌‌ స్కీమ్‌‌‌‌లో భాగంగా పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథనిలో స్కూళ్లను ఎంపిక చేసామన్నారు. కార్యక్రమంలో లీడర్లు వోడ్నాల శ్రీనివాస్, ముస్కుల సహేందర్, అయిలి ప్రసాద్,  సెగ్గం రాజేశం, కాచే కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.