- కొత్త లేబర్ కోడ్‌ను సమీక్షించాలని డిమాండ్
న్యూఢిల్లీ: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేకి అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. కొత్తగా తీసుకొచ్చిన లేబర్ కోడ్‌ను తక్షణమే సమీక్షించాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. దేశంలో నెలకొన్న నిరుద్యోగ సమస్యకు కేంద్ర ప్రభుత్వ హమ్ దో.. హమారే దో (మేమిద్దరం.. మాకిద్దరు) విధానాలే కారణమని విమర్శించారు.
కార్మిక కోడ్ వల్ల నోయిడా, పానిపట్‌లోని ఐవోసీఎల్ ప్లాంట్, రాయ్‌ఖేడాలోని అదానీ ఫ్యాక్టరీ, ఎన్‌టీపీసీ పత్రాతు, శ్రీపెరంబుదూర్‌లోని సామ్‌సంగ్ ఫ్యాక్టరీ వంటి అనేక చోట్ల కార్మిక అశాంతి నెలకొందని పేర్కొన్నారు.
కొత్త చట్టాలు ఉద్యోగ భద్రతను కల్పించకపోగా.. కాంట్రాక్టు కార్మిక వ్యవస్థను, హైర్ అండ్ ఫైర్ (నియమించుకోవడం, -తొలగించడం) సంస్కృతిని ప్రోత్సహిస్తున్నాయని మండిపడ్డారు.
