గ్రీన్ ఫీల్డ్ హైవేపై రాకపోకలు ప్రారంభం..తల్లంపాడు బ్రిడ్జి పైనుంచి వాహనాలకు అనుమతి

గ్రీన్ ఫీల్డ్ హైవేపై రాకపోకలు ప్రారంభం..తల్లంపాడు బ్రిడ్జి పైనుంచి వాహనాలకు అనుమతి

ఖమ్మం, వెలుగు : ఖమ్మం, దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవేపై రాకపోకలు ఆదివారం ప్రారంభం అయ్యాయి. తల్లంపాడు బ్రిడ్జి పైనుంచి వాహనాలను అనుమతిస్తున్నారు. దంసలాపురం దగ్గర రైల్వే వంతెన ఒక వైపు పూర్తి కాగా.. రెండో వైపు పూర్తి చేసేందుకు మరో మూడు నెలల సమయం పడుతుందని హైవే ఆఫీసర్లు చెబుతున్నారు. దీంతో ఒక వైపు పూర్తైన బ్రిడ్జిపైనే రెండు వైపులా రాకపోకలకు అనుమతిస్తున్నారు.

 వైరా నుంచి దేవరపల్లి వరకు మూడు నెలల కిందటి నుంచే వాహనాలు నడుస్తుండడంతో టోల్ ఫీజు వసూలు చేస్తున్నారు. ఆర్ఓబీ పనుల కారణంగా తల్లంపాడు నుంచి వైరా వరకు వాహనాలను అనుమతించలేదు. కానీ ఖమ్మం బైపాస్ రోడ్డుపై ట్రాఫిక్ సమస్య కారణంగా.. ఆర్ఓబి ఒక వైపు పూర్తి అయినప్పటికీ ప్రత్యేక అనుమతితో వాహనాల రాకపోకలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం హైవే పై ప్రయాణించి ఆర్ వోబీ పనులను పరిశీలించారు.