వరదకాల్వలో 30 కిలోల చేప.. . రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలంలో పట్టివేత

 వరదకాల్వలో 30 కిలోల చేప.. . రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలంలో పట్టివేత

వరద కాల్వలో చేపలు పట్టేందుకు వెళ్లిన ఓ వ్యక్తికి 30 కిలోల చేప దొరికింది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలంలోని మిడ్ మానేరుకు వరద కాలువ ద్వారా ఎల్లంపల్లి నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు చేపలు పట్టడానికి వరద కాలువ వద్దకు వస్తున్నారు. ఈ క్రమంలో సుల్తానాబాద్ కు చెందిన  రాజ్ కుమార్ వరదవెల్లి వద్ద గల వరద కాల్వలో చేపలు పడుతుండగా.. 30 కిలోల చేప దొరికింది. ఇంత భారీ చేపను చూసిన ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. -